Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ప్రపంచ పర్యవరణ దినోత్సవం
నవతెలంగాణ-కొత్తగూడెం
ఒకే ఒక భూమి...దానిని మనం ాపాడుకోవాలని, ప్రకృతి సామరస్యంగా జీవించడం అవసరమని కొత్తగూడెం పర్యావరణ ఇంజనీర్ రవిశంకర్, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వంచారు. స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో ర్యాలీని వారు ప్రారంభించారు. పోస్టాఫీస్ నుండి బస్టాండ్ మీదుగా కొత్తగూడెం క్లబ్ వరకు సాగింది. అనంతరం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి వక్తలు మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని, పర్యావరణనాకి హాని కలిగించే విధంగా ఉన్న వస్తువులను మండిచ వద్దని తెలిపారు. ప్రత్యమ్నయ ఇందన వనరులు వినియోగించాలని, ప్రకృతి రక్షణకు చెట్లు పెంచాలని కోరారు. రోజు రోజుకుపెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టక పోతే భావితరాలకు స్వచ్చమైన ప్రకృతిని అందిచలేమని తెలిపారు. ప్రకృతితో సామరస్యంగా జీవించడం కోసం పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, సింగరేణి పర్యావరణం కార్పోరేట్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త బివి.రావు, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమీషనర్లు నవీన్, శ్రీకాంత్ సింగరేణి మహిళ కళాశాల లెక్చరర్స్ జి.శైలజా, కె.శ్రీలత, ఎన్సీసీ, డిగ్రీ విద్యార్థినిలు, షారూఖ్ గజ్ధార్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.