Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెేంజి అధికారితో సహా పలువురి సిబ్బందికి గాయాలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎఫ్డీఓ బాబు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం అటవీ రేంజి కార్యాలయానికి చెందిన జీపు ప్రమాద వశాత్తు అదుపు తప్పి పల్టీ కొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబందించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..రేంజి అధికారి కనకమ్మ అటవీ సిబ్బందితో కలసి అటవీ రేంజి పరిధిలోని దేవరాపల్లి బీట్ను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం, చర్ల ప్రధాన రహదారి చిన్ననల్లబల్లి శివారులో కల్వర్టు వద్ద జీపు ప్రమాద వశాత్తు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో రేంజి అధికారి కనకమ్మతో సహా బీట్ ఆఫీసర్లు విజరు, నరేష్, రాజేష, వెంకటరత్నం, వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా వెంటనే వారి దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాదమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న ఎఫ్డిఓ భూక్యా బాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం వైద్య శాలలో చికిత్స పొందుతున్న రేంజి అధికారి కనకమ్మతో పాటు సిబ్బందిని పరిశీలించారు. ఏది ఎమైనా పెద్ద ప్రమాదం నుండి అటవీ శాఖ సిబ్బంది బయట పడ్డారనే చెప్పవచ్చు.