Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి, పేద ప్రజల ఆశాజ్యోతి, సిపిఐ సీనియర్ నాయకులు తూము ప్రకాష్‌రావు జ్ఞాపకార్ధం మేఘ శ్రీ హాస్పటల్ నందు నిర్వహించే బీపీ, షుగర్ ప్రత్యేక మెగా క్యాంపు బీపీ, షుగర్ పేషంట్లకు ఓ వరమని ప్రముఖ వైద్యులు టి ప్రణరు కుమార్ అన్నారు. మండల కేంద్రంలో బీపీ, షుగర్ ప్రత్యేక శిబిరాన్ని ఆదివారం విజయ వంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక క్యాంప్‌లో రూ.100కే నెలకు సరిపడ బీపీ, షుగర్ మందులు అందజేస్తున్న బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, సీపీఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, ఏలూరి పూర్ణచందు, ఏనుగు సుమన్ బాబు, క్యాంప్ నిర్వహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, సహాయకులు యంగల గిరి, భవాని తదితరులు పాల్గొన్నారు.