Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ-టెట్ పరీక్ష నిర్వహించడం అభినందనీయం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- సత్తుపల్లిలో టీఎస్‌యూటీఎఫ్ ప్రీ-టెట్ పరీక్ష
నవతెలంగాణ- సత్తుపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో విద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని అందులో భాగంగానే మనఊరు- మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా సకల సౌకర్యాలతో విద్యార్థులకు అందుబాటులో రానున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నవభారత్ డిగ్రీ కళాశాలలో టీచర్ ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రీ-టెట్ పరీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ఈనెల 12న జరిగే టెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు డీఎస్సీ సెలక్షన్లో కూడా ఉత్తమ ఉత్తీర్ణతను సాధించి ఉపాధ్యాయులుగా ఎంపీక కావాలని ఆకాంక్షించారు. ఒకవైపు ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర ఉద్యమాలు సాగించే టీఎస్‌యూటీఎఫ్ టీచర్ ఉద్యోగార్థుల కోసం ప్రీ-టెట్ పరీక్షను నిర్వమిం చడం అభినంద నీయమన్నారు. అనంతరం ప్రీ-టెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, టీఆర్ఎస్ నాయకులు దొడ్డా శంకరరావు, నవభారత్ డిగ్రీ కళాశాల ఛైర్మెన్ గాదె నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్ జీవీ లింగారెడ్డి, టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు జీఎస్ఆర్ రమేశ్, కె.నిర్మలకుమారి, జల్లిపల్లి మురళీమోహన్, జిల్లా నాయకులు మట్టపర్తి రాజేశ్వరరావు, సత్తుపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాల నాగేశ్వరరావు, కొప్పుల శ్రీనివాసరావు, వేంసూరు, పెనుబల్లి దమ్మపేట మండలాల యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.