Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-పెనుబల్లి
మచ్చలేని నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి తనవంతు సహాయం చేసే గొప్ప వ్యక్తి కర్రి రంగారావు అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో కర్రి సదా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్రి రంగారావు విగ్రహాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మండల ఎంపీపీగా, మార్కెటింగ్ చైర్మన్ గా, గ్రామ సర్పంచ్ గా అనేక సేవలు అందించిన కర్రి రంగారావు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పెనుబల్లి మండల నాయకులు కీసర శ్రీనివాసరెడ్డి, గూడూరు మాధవరెడ్డి, చిన్నస్వామి, యండ్ల సుబ్బారావు, వెంకటేశ్వరరెడ్డి, యలమంచి రమేష్, చిలుకూరి వెంకటేశ్వరరావు, కర్రి శ్రీనివాసరావు, కర్రి కమలాకర్, శేఖర్, మేడే నరసింహస్వామి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
పలు శుభకార్యాలలో పాల్గొన్న పొంగులేటి
కూసుమంచి : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కూసుమంచి మండలంలో పర్యటించారు. తురకగూడెం గ్రామంలో కన్నెబోయిన లింగయ్య కుమార్తె పుట్టెంటుకల వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం మండలంలో ఇటీవల వివాహం చేసుకున్న పలు జంటలను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. పొంగులేటి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబిస్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్, బజ్జూరి వెంకట్ రెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, బారి వీరభద్రం, గుండా దామోదర్ రెడ్డి, భీహ్మచారి, జనార్ధన్, అభి, వారి శ్రీను, ఉపేందర్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీకి పొంగులేటి అభినందనలు
ఖమ్మం: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే-ఐజేయు)కు నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, తెరాస రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర రావు, కోశాధికారి శివ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి కనకం సైదులు తో పాటు టీయూడబ్ల్యూజే-ఐజేయు నగర అధ్యక్షులుగా ఎన్నికైన మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసులను, ఇతర కమిటీ సభ్యులనూ పొంగులేటి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం బాధ్యులు ముందుండి పోరాడాలని సూచించారు. అవసరమైతే ఈ పోరాటానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాం నారాయణ, ఎన్.వెంకట్రావు, మురారి, భూపాల్ రావు, మాధవరావు, గోపి, మహేందర్ రెడ్డి, ఏ.రామారావు, కే.రజినీకుమార్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.