Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పబ్‌ల గుర్తింపులను రద్దు చేయాలి
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
జూబ్లీహిల్స్ అమ్నెషియా పబ్ గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షించాలని, నిందితులు ఎంతటివారైనా వదిలి పెట్టవద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు వ్యతిరేకంగా మండలంలోని ఏదులాపురం గ్రామంలో డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డ్సుతో ప్రదర్శన చేసి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గడ్డం వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మహిళలపై దాడులకు ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలే అన్నారు. మద్యం, అశ్లీల చిత్రాలు, వెబ్ సైట్లు, సినిమాలు, సీరియల్స్ వీటన్నింటినీ అరికట్టకుండా ముఖ్యంగా పబ్బులు, డిస్కో టెక్కులు, రేవ్ పార్టీలు ఇంకా ఇతరత్రా వాటికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చి ప్రోత్సహిస్తు న్నాయని, వెంటనే వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉరడీ చంటి, పొన్నెకంటి నరసింహారావు, అనిష్, యాదగిరి, ఉపేందర్, నాగరాజు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.