Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-మణుగూరు
బహూజన రాజ్యాధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నామని బిఎస్పి రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 85వ రోజు యాత్ర మణుగూరు మండలంలో పలు గ్రామాల్లో కొనసాగిందన్నారు. యాత్రలో భాగంగా తోగ్గూడెంలో పర్యటించారన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ టీఆర్ఎస్ పాలనకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని, వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ గద్దె దిగడం ఖాయమన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తొలగించాలని మాట్లాడుతున్నాయి అన్నారు. బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొడానికి చూస్తుందని విమర్శించారు. అలాగే బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యాత్రలో భాగంగా రాయన్న పేట కోయ గూడెంలో పర్యటించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం వారి అభివద్ధి కోసం బీఎస్పీ కట్టుబడి ఉందని తెలియజేశారు. పివి కాలనీలో అంబేడ్కర్ విగ్రహంకు నివాళులు అర్పించారు. యాత్ర తోగ్గూడేం రాయన్నపేట పీవీ కాలనీ పగిడెరు గ్రామాల్లో యాత్ర జరిగింది. తిరిగి యాత్ర చెరువు ముందు సింగారం అంబేడ్కర్ నగర్ అశోక్ నగర్ హనుమాన్ సెంటర్లలో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు ఇర్ప రవికుమార్, నియోజకవర్గ ఇంచార్జ్ నైనారపు నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు నల్లగట్ల రఘు, గద్దల సాంబ, కేసుపాక రమణ, భూర్గుల కరుణాకర్, శివ, నారపాక రవికిరణ్, రవి, మహిళ సంఘం అధ్యక్షురాలు మౌనిక, శశిరేఖ, శివ తదితరులు పాల్గొన్నారు.