Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల మహాసభలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-ఇల్లందు
రానున్న కాలంలో విద్య, వైద్యం, ఉపాధి, భూమి కోసం వ్యవస్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉదృత పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఇల్లందు మండల మహాసభ సున్నం రాజయ్య నగర్లో సోమవారం జరిగింది. ఈ వహాసభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పాలకుల విధానాలను వలన పేదలకు అందటం లేదని అన్నారు ఉపాధి పనుల్లో ట్రాన్సఫరెన్సీ, ఎకౌంటు బులిటీ పేరుతో కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు తెచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరితాడుగా మారే ప్రమాదం ఉందని, ఈ సర్క్యులర్ పేదలకు మెరుగైన పని కల్పన కంటే కార్పొరేట్ కంపెనీల సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు గ్రామీణ ప్రాంతాలకు ప్రమోట్ చేసే చర్యలాగ ఉంది. దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సర్క్యులర్ నెం 333ని తక్షణమే రద్దు చెయ్యాలని సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం మండల కమిటీని 15మందితో నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభ ను ఉద్దేశించి సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, అవాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబి, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్‌లు మాట్లాడారు. ఈ సభలో ఆలేటి కిరణ్, మన్నెం మోహన్ రావు, రాందాస్, వాసం రాము, వెంకటమ్మ, మూతి శ్రీదేవి, ముదిగొండ స్వర్ణ, సలీం, ప్రసాద్, సరిత, పాపారావు తదితరులు పాల్గొన్నారు.