Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలను చైతన్యపరిచి పోరాటానికి సంసిద్ధం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ (సీపీఐ కార్యాలయం)లో పట్టణ కౌన్సిల్ సమావేశం బండి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చెయ్యకుండా సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే మరొక పక్క రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కనీసం జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చి విచ్చలవిడిగా టాక్స్‌ల పేరుతో ప్రజలను దోచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయి బాబు, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు రాహుల్, పద్మజా, ప్రజాసంఘాలు నాయకులు తదతరులు పాల్గొన్నారు.