Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుండి సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మించిన రైల్వే లైన్ సుజాతనగర్ మండలం కోయగూడెం గ్రామంలో కోయగూడెం గ్రామం పేరుతో రైల్వే పనులు నడిచాయని అదే గ్రామంలో రైల్వే స్టేషన్‌ను కూడా నిర్మించారని ఆ రైల్వే స్టేషన్ పేరును కోయగూడెం రైల్వే స్టేషన్ పేరును కొనసాగించాలని కోరుతూ కొత్తగూడెం ఏరియా రైల్వే మేనేజర్‌కు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్ మాట్లాడుతూ కోయగూడెం గ్రామంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు రైల్వే లైన్, స్టేషన్ నిర్మాణంకు తమ భూములను, ఇండ్లను, ఇంటి స్థలాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నిర్మించిన రైల్వే స్టేషన్ కోయగూడెం పంచాయతి, గ్రామ పరిధిలోనే ఉందని గుర్తుచేశారు. ఈ రైల్వే స్టేషనకు కోయగూడెం పేరును పెట్టనివ్వకుండా కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంకు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు, సంఘీభవం తెలిపారు. గ్రామపెద్దలు సర్పంచ్ భర్త కంగాల అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ బండ శ్రీను, టిఏజిఎస్ జిల్లా నాయకులు రామకృష్ణ, శ్రీనులు తదితరులు పాల్గొన్నారు.