Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
ఆదివారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి మండల పరిధిలోని పాతర్ల పాడు గ్రామానికి చెందిన నిరుపేద గరికపాటి వీరయ్య రేకుల ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. గ్రామంలో ఓ రేకుల ఇంట్లో వీరయ్య తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. గాలి దుమారం సమయంలో వారంతా ఇంట్లోనే ఉన్నారు. ఈదురు గాలి ఒక్కసారిగా రేకుల ఇల్లు పెద్ద శబ్దంతో కూలిపోయింది. దీంతో వారు భయంతో పెద్దగా కేకలు వేయగా సమీపంలో ఉన్న వారు ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు లాగి కాపాడారు. ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. నిరుపేదలైన తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు కనికరించలేదని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పక్కనే ఉన్న ఓ ఇంట్లో తలదాచుకుంటున్న వీరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని అని గ్రామస్తులు కోరారు.