Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం
- త్రి టౌన్ సీఐ అబ్బయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
చిన్నతనం నుండి మార్షల్ఆర్ట్ చేర్చుకోవడం విద్యార్థులకు చాలా మంచి అలవాటని కొత్తగూడెం త్రి టౌన్ సిఐ పి.అబ్బయ్య అన్నారు. సోమవారం తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుండి మే 31వ తేదీ వరకు కొనసాగిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం రాత్రి ముగిసింది. పలు ప్రాంతాలకు చెందిన 50 మంది బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరం టైక్వాండో క్రీడా కారిణి కోచ్ ఇనిగాల తన్మయి పర్యవేక్షణలో ప్రతిరోజు పూటలు నెలరోజుల పాటు శిక్షణ నిర్వహించారు. బాల, బాలికలు ఉత్సాహంతో పాల్గొన్నారు. నెల రోజుల పాటు పిల్లలు నేర్చుకునే మెలకువలను వారి ప్రతిభను గుర్తించేందుకు సోమవారం అండర్-14 జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చి గెలుపొందిన బాల, బాలికలకు సీ.ఐ ఎం.అబ్బయ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎం.ఏ. రజాక్ టైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనిగాల.మొగిలి, టైక్వాండో కోచ్ క్రీడాకారిణి. ఇనిగాల తన్మయి, టైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.ప్రసాద్, ఆర్.నిరంజన్, కూసపాటి శ్రీనివాస్, నేతాజీ వ్యాన్ శాల అధినేత కూచన కృష్ణారావు , జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశిహుస్సేన్, మాదాసి శ్రీరాములు, ఏ. సుజాత, కె.శ్రీనివాస్, దూడల. బుచ్చయ్య, గాయత్రి, లక్ష్మణ్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.