Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
2021-22 సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నో సేవలందించిన లయన్ లగడపాటి ప్రభాకరరావు ఆధ్వర్యంలో 15వ చార్టర్ నైట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా గవర్నర్ అమృతపల్లి కోటేశ్వరావు మాట్లాడుతూ ఎన్నో విశిష్ట సేవలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా జిల్లాలో మొదట స్థానంలో వుందన్నారు. వైరా క్లబ్ పర్మినెంట్ ప్రాజెక్ట్ లు అయిన లయన్స్ ఐ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద వారికి ఉచిత వైద్యం అందించటం మరియు అని పర్మినెంట్ ప్రాజెక్టులు ద్వారా ఎంతో మందికి విశిష్ట సేవలు అందుతున్నాయని పూర్వ గవర్నర్లు అందరు తెలియజేసారు. ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కీ నోట్ స్పీకర్ లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా 24 లక్షలు రూపాయలు సేవలు అందించామన్నారు. రాబోయే రోజులో ఇంకా విశిష్ట సేవలు అందిస్తామని తెలియజేసారు. చార్టర్ నైట్ సందర్భంగా ఇద్దరు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మరియు రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే చిరు వ్యాపారులకు గొడుగులు అందించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ వైరాకి యాభై వేల రూపాయాల విలువ గల ఈసిజి మిషన్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ డాక్టర్ రాఘవరెడ్డి, మోతుకూరి మురళిధరావు, గోపాల్ రెడ్డి, దార కృష్ణారావు, డాక్టర్ మోహన్ రెడ్డి ప్రసాద్, వీరభద్రావు, కోర్డినేటర్ నంబూరి మధు డిస్టిక్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, లక్ష్మా రెడ్డి, నూకల వాసు ,ప్రెసిడెంట్ లగడపాటి ప్రభాకరరావు, సెక్రటరీ డాక్టర్ శ్రీధర్ గౌడ్, ట్రెజరర్ నాళ్ళ నాగేశ్వరావు, ప్రోగ్రామ్ కోర్డినేటర్ ఉండ్రు శ్యామ్ బాబు పాల్గొన్నారు.