Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
పాతసెంటరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులను మంజూరు చేయాలని ఆ పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) బాధ్యులు ఆ పాఠశాల హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్ నేతృత్వంలో ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం అందించారు. 240 మంది విద్యార్థులతో ఈ పాఠశాల డిజిటల్ తరగతి గదిని ప్రారంభించుకొని ఇంగ్లీష్ మీడియంతో పాఠశాల నడుస్తోందని కలెక్టర్‌కు ఎమ్మెల్యే సండ్ర వివరించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ కలిసి వినతిపత్రం అందించిన వారిలో ఏఎంసీ ఛైర్మెన్ పాశం వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మెన్ మూవీనా పాల్గొన్నారు.