Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
పెట్టుబడిదారి ప్రభుత్వాలయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా పోరాటాల ద్వారా తిరుగుబాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మధిర నియోజకవర్గ స్థాయి సమావేశం సోమవారం వత్సవాయి జానకిరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఖమ్మం జిల్లాలో కేంద్రీకరించిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మధిర నియోజకవర్గ స్థాయి నాయకత్వం గ్రామాలలో ప్రజా సమస్యలను గుర్తించి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ సిపిఎం మండల కార్యదర్శులు దివ్యల వీరయ్య, దొండపాటి నాగేశ్వరరావు, మడుపల్లి గోపాలరావు, బట్టు పురుషోత్తం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు నియోజకవర్గ కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, ఏడునూతల లక్ష్మణరావు, తోట కూర వెంకట నర్సయ్య, మండవ ఫనీంద్ర కుమారి గొల్లపూడి కోటేశ్వరరావు, పీసీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.