Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
నగరంలో పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజరు కుమార్ సోమవారం పరిశీలించారు. కార్మికులతో కలిసి డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగును తొలగించారు. 36వ డివిజన్ పి.ఎస్.ఆర్.రోడ్లో కాల్వలో మురుగు తొలగించే పనులను మంత్రి ప్రారంభించారు. గాంధీ చౌక్ సెంటర్లో రోడ్డు మరమ్మత్తు పనులను పారతో స్వయంగా శుభ్రం చేశారు. 51, 52వ డివిజన్ ఎన్.ఎస్.పి క్యాంపులో ప్రభుత్వ భూములను శుభ్రం చేసి సంరక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, వాటిని సకాలంలో అర్హులైన వారందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అనంతరం 14, 16, 36, 40, 41, 42, 45వ డివిజన్లోని నర్సరీ లను పరిశీలించారు. వచ్చేహరితహారం కార్యక్రమం కొరకు ప్రభుత్వ లక్ష్యానికి మించి మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎస్.ఇ ట్రాన్స్కో ఏ.సురేందర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్ కుమార్, వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు కర్నాటి క్రిష్ణ, పసుమర్తి రామ్ మోహన్, రాపర్తి శరత్, కమర్తపు మురళి, శీలంశెట్టి రమా వీరభద్రం, కూరాకుల వలరాజు, మక్బూల్, బుర్రి వెంకట్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, తహశీల్దార్ శైలజ పాల్గొన్నారు.