Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
గ్రామాలు, పట్టణాలలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికే క్రీడా ప్రాంగణల ఏర్పాటు లక్ష్యమని ఎంఎల్ఏ హరిప్రియ అన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం 4 రోజు మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంఎల్ఏ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడ మైదానంలో వాలీబాల్ ఆడి అబ్బురపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఒక క్రీడా మైదానం ఉండాలని తెలిపారు. అనంతరం ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఆనకట్ట అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ మున్సిపల్ కమిషనర్ అంకు షావలి, తాసిల్దార్ కృష్ణవేణి, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు , కౌన్సిలర్లు సయ్యద్ ఆజాం, పద్మావతి, నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, తారా, ఏఈ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.