Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
పేద దళితుల భూములు లాక్కుంటే ప్రభుత్వం పతనం తప్పదని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రాయి రాజా అన్నారు. అయ్యన్నపాలెం ఇంటి స్థలాల నిర్వాసితులకు పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కమిటీ సభ్యులు రాయి రాజా మాట్లాడుతూ దళితుల భూమి రెక్కల కష్టం మీద పోడు కొట్టి సంపాదించిన భూమి పార్కు, క్రీడా స్థలాలు పెట్టి పేద ప్రజల పొట్ట కొట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, పార్టీ సభ్యులు దాసరి సీతారాములు భూ నిర్వాసితులు నీలమ్మ, దాసరి కల, ముత్యం, లింగం దాస్, తీర్పులు, వెంకటేష్, భాస్కర్ రావు, హుస్సేన్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.