Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళ తలకు బలమైన గాయం
- పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు
నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి మండలం మూకమామిడి రెవెన్యూ గ్రామ పరిధిలోని మొగరాలగుప్ప గ్రామంలో భూమి హద్దుల ఏర్పాటు విషయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ములకలపల్లి ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశాడు. వివరాల్లోకి వెళితే... మూకమామిడి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 25/ఇ లో కీసరి వెంకటమ్మకు వారసత్వంగా 0.11 గుంటల భూమి సంక్రమించింది. ఇందులోనే కీసరి వెంకటమ్మ తన ఇద్దరు కూతుళ్ళుతో కలిసి చిన్న గుడిసె నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. చిన్నకూతురు హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటుండగా మూడవ కూతురు కీసరి శ్రీదేవి చాపరాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కీసరి వెంకటమ్మ తన 0.11 గుంటల భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకునే క్రమంలో ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి కీసరి రామరాజు, కీసరి లక్ష్మణ్ రావులు అన్న భార్య అయిన కీసరి వెంకటమ్మపై దాడి చేశారు. అడ్డు వచ్చిన కీసరి శ్రీదేవిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో కొట్టడంతో శ్రీదేవి తలకు బలమైన గాయాలు అయ్యాయి. గాయాలతోనే ములకలపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ సురేష్ ముందుకు వెళ్లడంతో ఆయన సూచనమేరకు ప్రధమ చికిత్స చేయించుకుని ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలమేరకు ఐపిసి 354, 294(బి), 324ఆర్/డబ్ల్యూ 34 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి తగిలిన గాయం వలన తలకు ఆరు కుట్లు పడినట్టు బాధితురాలి తల్లి తెలియజేసింది. కాగా సంవత్సర కాలంగా తమపైన కీసరి రామరాజు, కీసరి లక్ష్మణ్ రావులు ఇదేవిధంగా దాడులు చేస్తున్నారని బాధితులు తెలిపారు.
కాగా ఇదే వివాదంలో గత సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీన ములకలపల్లి పోలీసుస్టేషన్లో ఒకసారి ఏఎస్ఐ తిరుమలరావు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కీసరి వెంకటమ్మ తెలియజేసారు.