Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుందని, ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆశాలు, గర్భీణులకు ఆసుపత్రిల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వైద్యురాలు స్పందన, వైద్య సిబ్బందితో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆశాలు, వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించి గ్రామాల్లో నిత్యం పర్యటనలు చేస్తూ ఆశా, ఆసుపత్రి సిబ్బంది గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సౌకర్యాలను వివరించి ప్రైవేటు దవాఖానాలకు వెళ్ల కుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సుఖ ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. అంతే కాకుండా బాలింతలకు పౌష్టికా హారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ స్పందన, హెచ్ఐవో రవి, యూడీపీ పరమేష్, నాగేశ్వరరావు, వైద్యసిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.