Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వల్ల ప్రపంచంలో భారతదేశ గౌరవానికి మచ్చ
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-పినపాక
భారతదేశం అన్ని మతాలను అన్ని సంస్కృతులను గౌరవించే దేశంగా ప్రపంచంలో గొప్ప గౌరవం ఉందని కానీ బీజేపీ వంటి మతతత్వ పార్టీల నాయకుల వ్యాఖ్యల వల్ల దేశం పట్ల చెడు అభిప్రాయం ఏర్పడుతుందని, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు బీజేపీ విధానాలను విమర్శిస్తున్నాయని భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, కేంద్రం రాజ్యాంగ విరుద్దమైన వ్యాఖ్యలు చేసే వారిని అదుపు చేయడం లేదని డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 86వ రోజు యాత్ర పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరకగూడేం మండలాల్లో కొనసాగింది. పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్లో గల కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎడుళ్ళ బయ్యారంలో ముత్యాలమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలను ఉద్దశించి మాట్లాడుతూ తెలంగాణలో 99 శాతం మంది ప్రజలు బహుజనులు పేదలుగా, కూలీలుగా ఉంటే కేవలం ఒక్క శాతం ఉన్న ప్రజలు అధికారంలో, సంపద వారి దగ్గర ఉందని తెలిపారు.
పినపాక నియోజకవర్గంలో ఇల్లు, నీళ్ళ సమస్య అధికంగా ఉందన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి లేక కూలి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు మండలంలో మెజారిటీగా పేద ఎస్టి, ఎస్సీ ప్రజలే ఉన్నారు కానీ, మండల కేంద్రంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ కూడా వ్యాపార రంగంలో లేడని, సంపదకు దూరంగా ఉన్నారని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో బహుజన జెండా ఎగరడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓడడం ఖాయమన్నారు. యాత్ర బయ్యారం క్రాస్ రోడ్, ఎడుల్ల బయ్యారం, రావిగూడెం, గోవిందాపురం గ్రామాల్లో కొనసాగింది. ఏడుల్ల బయ్యారంలో భారీగా విద్యార్థులు, మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పినపాకలో నీలి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు ఇర్ప రవి, తదితరులు పాల్గొన్నారు.