Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పంట భూమి సరిహద్దుల్లో జమాయిల్ సాగు చేస్తే రెండు పంటలు పండించి లాభాలు పొందవచ్చని ఐటీసీ లిమిటెడ్ పీఎస్ పీడీ మేనేజర్ జితేందర్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మర్కోడు రైతు వేదికలో మర్కోడు రాఘవాపూరం, నడిమి గూడెం, బోడాయికుంట రైతులకు జామాయిల్ పెంపకంపై అవగాహన కల్పించారు. పత్తి, మిరప, ఇతర పంటల సాగుతో పాటు సరిహద్దుల్లో గెట్లపై జామాయిల్ వేయాలని, దాంతో రైతు రెండు విధాలుగా లాభం పొందవచ్చు అన్నారు. జామాయిల్ మొక్కల పెంపకం కోసం రైతులకు ఐటీసీ లిమిటెడ్ పీఎస్ పీడీ ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాస్ రావు, శ్రీధర్, పాల్గొన్నారు.