Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
జాతీయ స్థాయి జూనియర్ ఖోఖో పోటీలకు ఖమ్మం జిల్లా విద్యార్థి ఎం.పవన్ ఎంపికైనట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి.రామయ్య, ,ప్రదాన కార్యదర్శి పి.వీర రాఘవయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎంపికలు కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించి, హైదరా బాదులో జరిగినటువంటి రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత క్రీడా ప్రావీణ్యం కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికలు నిర్వహణ కమిటీ వారి ద్వారా పవన్ ఎంపికయ్యారని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అలాగే రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జూనియర్ ఖోఖోలో ఇండియా శిక్షణ శిబిరాన్ని వరంగల్ మినీ స్టేడియం నందు నిర్వహించి అక్కడ శిక్షణ ఇచ్చారు. అనంతరం ఈ నెల 8, 9, 10 తేదీల్లో హర్యానా రాష్ట్రం పంచకులలో జరుగు జాతీయ స్థాయి జూనియర్ ఖోఖో పోటీలలో పాల్గొనటానికి ఖమ్మం జిల్లా క్రీడాకారుడు ఎం.పవన్ కుమార్ వెళ్లారు. ప్రస్తుతం పవన్ టిటిడబ్ల్యూ ఆర్జెసి కిన్నెరసాని జూనియర్ కళాశాల నందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఈ క్రీడాకారుడు ఎంపిక పట్ల యావత్ ఖమ్మం జిల్లా వ్యాయామ విద్య విభాగం అలాగే ఖమ్మం జిల్లా ఖోఖో ఆఫీస్ బ్రదర్స్ అందరు హర్షం వ్యక్తం చేసారు. ఈ ఖోఖోలో ఇండియా పోటీల్లో పాల్గొనడం ఖమ్మం జిల్లా నుంచి తన మూడవ క్రీడాకారుడైన పవన్ మంచి బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పి.రామయ్య, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్య, ట్రెజరర్ సిహెచ్ శ్రీహరి జాయింట్ సెక్రెటరీ పీ నరసయ్య, ఎస్.రామారావు, ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరు కూడాను విజయ ఆశీస్సులు అందజేస్తూ క్రీడాకారులు వారి యొక్క అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడాకారుల ఎంపిక పట్ల కల్లూరు గేమ్స్ కమిటీ సభ్యులు అలాగే కల్లూరు తోపుడు బండి ఫౌండేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సాధిక్ అలీ ప్రత్యేక అభినందనలు తెలియజేసి క్రీడా ఆశీస్సులు అందజేయడం జరిగింది.