Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సొంత ఇంటి కల తీరేదెన్నడు?
- నేడు సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-చర్ల
మండలంలో అసంపూర్తి నిర్మాణాలతో అలంకారప్రాయంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు దర్శనమిస్తున్నాయని, అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కలివేరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని సీపీఐ(ఎం) నాయకులు గ్రామస్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సొంత ఇంటి కల తీర్చేవిధంగా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ. లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు మండల కేంద్రంలో జరుగుతున్న ధర్నాలో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మండలంలో గోగుబాకా, వీరాపురంలో నిర్మించిన ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలివేరు గ్రామంలో 25 ఇళ్ల నిర్మాణం పిల్లర్లు పోసి గాలికి వదిలేశారని విమర్శించారు. పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తుందని ఈ పోరాటంలో ప్రజలంతా రాజకీయాలకతీతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండలంలోని ఇల్లు లేని పేదలకు సమీకరించి నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి, మండల కమిటీ సభ్యులు శ్యామల వెంకటేశ్వర్లు, తాటి నాగమణి, పార్టీ నాయకులు కుర్సం నాగేశ్వరరావు, సోడి లక్ష్మీ నర్సు, ఉయిక లక్ష్మయ్య, సోడి సుభద్ర, వాగే లక్ష్మి, పర్శిక సుశీల తదితరులు పాల్గొన్నారు.