Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
- నెలలు తరబడి వేతనాల బకాయిలు
- వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కనకయ్య, ప్రధాన కార్యదర్శి మచ్చా
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉపాధి వేతనాలు చెల్లింపులో అధికారుల నిర్లక్షయం తగదని, ఉపాధి హామీ పథకం నిర్విర్యానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, కూలీలకు నెలలు తరబడి వేతన బకాయిలు ఉన్నాయని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం ఆర్.శ్రీనివాస్ అధ్యక్షతన కొత్తగూడెం సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకంలో పనిచేసిన కూలీలకు నెలలు తరబడి వేతనాలు చెల్లించ కుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆచరణలో నిరుగార్చాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వ్యవసానికి అనుసందానం చేసి గ్రామీణ పేదలకు అన్యాయం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలని కూలీలకు పిలుపు నిచ్చారు. ఉపాథి నిధులను ఇతర రంగాలకు మళ్ళించి తెలంగాణా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమ ర్శించారు. ఉపాది పథకానికి నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో ఉపాథి పని ప్రదేశా లలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని అన్నారు. నీడ, వసతి, మంచినీళ్లు, మెడికల్ కిట్లు, ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వేతనాలు చెల్లింపులో అధికారుల జాప్యం జరుగు తుందన్నారు. వేతనాలు గిట్టక కూలీ లు ఇబ్బంది పడుతున్నారు. టెక్నికల్ సమస్యల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమ స్యలన్నీ పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయ కులు చిరంజీవి, నిమ్మల వెంకన్న, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, పాల్గొన్నారు.