Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన అసంపూర్తిగా ఉన్న ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) భవన పునర్నిర్మాణ పనులను సర్పంచ్ రాయపూడి నవీన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సమాజంలో జరుగుతున్న ఆర్థిక, సాంఘిక, సామాజిక దోపిడీని అరికట్టే విషయంలోనూ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్నారు. నిత్యం ఎండనకా వాననకా రాత్రింబవళ్ళు వార్తల సేకరణ కోసం ప్రాణాలకు తెగించి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక విలేకరులకు నేటికి మండల కేంద్రంలో సొంత భవనం లేకపోవడంతో వార్తలను పంపించడంలో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గత అనేక ఏళ్లుగా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న భవనానికి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం లో పునర్ నిర్మాణ పనులను ప్రారంభించడం సంతోషకర మన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గండికోట సుబ్రహ్మణ్యం, సిపిఎం, సీపీఐ మండల కార్యదర్శులు కేవీ రామిరెడ్డి, కర్నాటి భాను ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, దోసపాటి చంద్రశేఖర్, మామిడి వెంకన్న, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మండల నాయకులు పగిడికత్తుల రామదాసు, బిజెపి మండల అధ్యక్షుడు మన్నే కృష్ణారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్, నేలకొండపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మండల గౌరవ అధ్యక్షుడు అత్తులూరి హనుమంతరావు, గౌరవ సలహాదారులు కొల్లి హరీష్ బాబు, అధ్యక్షుడు డేగల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తోళ్ళ బుచ్చాలు, ఉపాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎల్లుట్ల సైదులు, కోశాధికారి బైరం ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, ఎన్ దానకర్ణ, మామిడి వెంకన్న, కసరబోయిన వెంకటేశ్వర్లు, కోలేటి నారాయణ, కందికొండ శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.