Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
గ్రామస్థాయి క్రీడా మైదానాలకు పేదల భూములు తీసుకోవద్దని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అసైన్మెంట్ పంచ రాయి పోరంబోకు భూములను లాక్కొని రైతు వేదికలు ప్రకృతి వనాలు ప్రభుత్వ అవసరాలకు వాడుకొని అనేక మంది పేదలను భూములకు దూరం చేసిందని అన్నారు. ఇటీవల క్రీడా మైదానాల పేరుతో గ్రామ పంచాయతీ స్థాయిలో పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను బెదిరించి లాకుంటున్నారని, అనేకమంది పేదలు భూములు లేక ఇబ్బందులు పడుతున్నారని పేదల భూములు జోలికి వెళ్ళొద్దని ప్రభుత్వాన్ని కోరారు . క్రీడా మైదానాలు కావలసి వస్తే ప్రభుత్వమే ధనికుల భూమి కొనుగోలు చేసి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి తప్ప పేదల భూములు ఆక్రమించొదని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ కార్మికులకు రేషన్ షాపుల ద్వారా 17 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కొండ బోయిన నాగేశ్వరరావు, పొన్నెకంటి సంగయ్య, వత్సవాయిి జానకి రాములు, ఎర్ర శ్రీనివాస రావు, గద్దల రత్నమ్మ, బంధం శ్రీను, వేల్పుల భద్రయ్య, అంగిరేకుల నరసయ్య, తేలప్రోలు రాధాకృష్ణ పాల్గొన్నారు.