Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు అండ
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని అసెంబ్లీ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం చేయడమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లక్ష్యమని సీఎల్పీ లీడర్ మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాలుగో విడత పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం మీనవోలు గ్రామంలోని అంకమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తక్కెళ్ళపాడు, శకునవీడు, ములుగు మాడు ఇనగాలి గ్రామాల మీదుగా సాగింది. పాదయాత్రకు బ్రహ్మరథం పట్టి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లోని దివంగత నేతలు గాంధీ, రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్, శీలం సిద్ధారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివాలాకోరు ప్రభుత్వమని ఘాటుగా విమర్శించారు. అనంతరం ఆయన పర్యటించిన పలు గ్రామాల్లో ప్రజా సమస్యలపై వినతి పత్రాలను తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క సతీమణి(అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ) మల్లు నందిని, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పువాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మధిర మండల పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి కిషోర్, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్ లు వేమిరెడ్డి అనురాధ, కటార పు బ్రహ్మయ్య, వెంకటరెడ్డి, ములుగుమాడు మాజీ స ర్పంచ్ గంట తిరుపతమ్మ, మండల ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, కడియం శ్రీనివాసరావు, శీలం నర్సి రెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.