Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యదర్శికి అప్పగింత
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలం కేటాయింపు పెద్ద సమస్యగా మారింది. దీంతో గతంలో ప్రభుత్వం శాఖలకు కేటాయించిన స్థలాలనే నేడు క్రీడా ప్రాంతాలకు సేకరించడంలో ఇటు రెవెన్యూ, అటు సంబంధి శాఖల అధికారులు మధ్య శాఖా పరమైన అంతర్ఘర్షణలకు చోటు చేసుకునే పరిస్థితి నెలకొంది. గురువారం స్థానిక రెవిన్యూ సిబ్బంది అశ్వారావుపేట-జంగారెడ్డిగూడెం రోడ్డులో రహదారి పక్కనే ఉన్న చిన్ననీటి పారుదల శాఖ డివిజనల్ కార్యాలయం ప్రాంగణంలో గల ఒక ఎకరం భూమిని మేజర్ పంచాయతీ అశ్వారావుపేట తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ హరిక్రిష్ణ సమక్షంలో సేకరించి జెడ్పీటీసీ వరలక్ష్మి, రైతు బంధు మండల సమన్వయ సమితి సమన్వయకర్త జూపల్లి రమేష్ చేతులు మీదుగా పంచాయతీకి అప్పగించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఐబీడీఈ క్రిష్ణ ''శాఖా పరిధిలో ఉన్న స్థలాలను శాఖ భవిష్యత్ అవసరాల రీత్యా ఇతర శాఖలకు గానీ మరే ఇతర సంస్థలకు ఇచ్చేది లేదని శాఖా ఉన్నతాధికారుల ఆదేశాలు'' ఉన్నాయని తెలిపారు.
ఇదే విషయం అయి తహశీల్దార్ చల్లా ప్రసాద్ మాట్లాడుతూ ఆ శాఖకు ఇంకా అదనంగా ఎకరం పైగా ఖాలీ స్థలం ఉందని, కలెక్టర్ ఆదేశాలు మేరకే సేకరిస్తున్నామని తెలిపారు.