Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం ఆధ్వర్యంలో పురుగుమందు డబ్బాలతో రాస్తారోకో
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మించే సీతమ్మ సాగర్ బహుళార్దక సాధక ప్రాజెక్టు పెండింగ్ భూముల పరిహారం చెల్లించే విషయంలో అధికారుల నిర్లక్షాన్ని నిరశిస్తూ రైతు సంఘం ఆద్వర్యంలో గురువారం భద్రాచలం చర్ల ప్రదాన రహదారి చిన్నబండిరేవు వద్ద రైతులు మందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. రైతు సంఘం మండల కమిటీ సభ్యులు వేమాని వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో రైతులు కరకట్ట నిర్మాణం కోసం ఇసుకు తోలకాలు సాగిస్తున్న టిప్పర్ల ముందు మందు డబ్బాలు చేత బట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెండింగ్ భూముల విషయంలో రైతులు ఒక అవగాహనకు వచ్చి డబ్బులు చెల్లించాలని అధికారులను వేడుకున్నప్పటికి రైతులను కోర్టులకు ఎక్కే విదంగా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వే అధికారుల నిర్లక్షం మూలంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లించకుండానే కరకట్ట నిర్మాణ పనులు ఎలా చేపడతారని ఆయన ఆరోపించారు. దీంతో పాటు రైతులు నిత్యం పంట పొలాలకు వెళ్లే రహదారుల పై భారీ వాహనాలు అధిక లోడుతో రాక పోకలు సాగించడం వలన రహదారులు పాడై పోతున్నాయని దీని వలన రైతులు వర్షాకాలంలో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు చిన్నబండిరేవు గ్రామానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.