Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ బెల్లయ్య నాయక్
కొత్తగూడెం: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పన కోసం, పోడుభుములకు పట్టాల సాదనకై మలిదశ ఉద్యమం చేయనున్నట్లు, జూలై 1న మహబుబాబాద్‌లో జరిగే లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) జాతీయ సదస్సు, 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిల్వర్ జుబ్లి సెలబ్రేషన్స్ చలో మహబూబాబాద్‌ను జయప్రదం చేయండని లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్ పిలుపు నిచ్చారు. గురువారం చుంచుపల్లి మండలం విద్యానగర్‌లో జరిగిన (ఎల్ హెచ్ పీఎస్) ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముందుండి పోరాడిన గిరిజనులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు పూర్తి అయినా సీఎం ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని విమర్శించారు. జులై 1 నేటి వరకు 25 వసంతాలు (సిల్వర్ జూబ్లీ) పూర్తి చేసుకొని గ్రీన్ హక్కుల సాధన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 1న జరిగే జాతీయ సదస్సుకు యావత్ లంబాడి జాతి మేధావులు ఉద్యోగులు విద్యార్థులు కార్మిక కర్షకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా కోట్య నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ భీమా నాయక్, ఎస్పీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్, ఎల్ఎస్ఓ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుక్య మంగిలాల్ నాయక్, జిల్లా అధ్యక్షులు గుగులోత్ మోహన్ నాయక్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.