Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?
- ఆస్పత్రి సిబ్బందిని నిలదీసిన గర్భిణీ కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఓ శిశువు మృతి చెందింది. ఏరియా ఆస్పత్రి వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందినట్ల్టు గర్భిణీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు పట్టణానికి చెందిన ఇర్ఫా విజయకుమారికి సత్తుపల్లిలో నివాసం ఉండే ఇర్ఫా బాలకృష్ణకు గతేడాదాది మే నెలలో పెళ్లి అయ్యింది. భర్త బాలకృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయకుమారి గర్భవతి అయ్యింది. అప్పటినుంచి ఆమెని హైదరాబాద్లో ఓ వైద్యశాలలో బాలకృష్ణ నెల, నెల వైద్య పరీక్షలు చెయిస్తున్నారు. ఈ క్రమంలో విజయ కుమారికి నెలలు నిండటంతో మణుగూరులో తన అత్త ఇంటికి పంపారు.
ఈ నెల 4వ తేదీన గర్భం దాల్చాస్సి ఉండగా, వైద్యులు ఆ తేదీని 6వ తేదీకి మార్చారు. ఈ క్రమంలో విజయకుమారి కుటుంబ సభ్యులు ఆమెని 6వ తేదీన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో తనకి మూడు రోజుల నుంచి రక్త స్రావం జరుగుతున్నా ఆసుపత్రి వైద్యులు పట్టించు కోవలేదని, ఈ క్రమంలో విజయకుమారికి కడుపులో నొప్పి తీవ్రంగా వస్తుందని ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీయండి అని విజయకుమారి కుటుంబ సభ్యులు వైద్యులని కోరినట్లు ఆమె బంధువులు విలేకరులకు తెలిపారు. ఈ క్రమంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మిడ్వైఫ్ విధానం ద్వారా వైద్యం అందించి, నార్మల్ డెలీవరి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే విధంగా ప్రయత్నిస్తామని వైద్యులు, వైద్య సిబ్బంది తమకు తెలిపినట్లు వారు తెలిపారు. విజయ కుమారి కుటుంబ సభ్యులు ఆ మిడ్ వైఫ్ సిబ్బందికి ఎంత చెప్పినా ఆ సిబ్బంది వినిపించుకొకపోగా, వారిపై ఇష్టాను సారంగా మాట్లాడి నోరు పారేసుకున్నారని, మేము ఇక్కడ ఉంది కేవలం నార్మల్ డెలీవరీలు చేయడానికే, తప్ప ఆపరేషన్ చేయడానికి కాదు, అలా చేస్తే మమ్మల్నీ ఇక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తారని అక్కడ ఉన్న ఓ నర్సు నోరు బాధితులతో వాగ్వాధానికి దిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమా?
పురిటి నొప్పులతో బాధపడుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్న విజయ కుమారికి వైద్యాధికారులు సకాలంలో ఆపరేషన్ చేస్తే శిశువు మరణించి ఉండేది కాదని బాధిత బంధువులు పేర్కొన్నారు. శుక్రవారం గర్భిణీకి నొప్పులు రావడంతో వైద్యాధికారులకు తెలిపటంతో అప్పుడు ఆపరేషన్ చేశారు. అప్పటికే శిశువు మరణించి ఉంది. వైద్య అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుము న్నీరుగా విలపిస్తున్నారు.
నార్మల్ డెలివరీ కోసం వైద్యాధి కారులు, సిబ్బంది వారి టార్గెట్ పూర్తి చేయాలని బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో వైద్య అధికారులు, వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న వరుస సంఘటనపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.