Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్ రేగాకు చెక్కును అందజేసిన తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మన ఊరు-మన బడికి రూ.25 లక్షల చెక్కును ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు, ఎన్నారై ప్రతినిధి తాళ్ళూరి జయ శేఖర్ అందజేశారు. బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో శుక్రవారం తాళ్ళూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్ళూరి భారతి దేవి జ్ఞాపకార్ధంగా వారి కుమా రుడు తాళ్ళూరి జయ శేఖర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కోసం రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించి అందజేశారు. ఈ సంద ర్భంగా విప్ రేగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శనం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధి స్తుంద ని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వా మ్యాన్ని ఈ విషయంలో కోరినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం : తానా మాజీ అధ్యక్షుడు జయశంకర్
సీఎం కేసీఆర్ తీసుకున్న మన ఊరు-మన బడి పథకం నిర్ణయం చారిత్రాత్మకమని తానా మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి తాళ్ళూరి జయశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం మార్గదర్శకం అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. పేద ప్రజలకు సామాన్య, మధ్య తరగతి పిల్లలకు విద్యను మరింత చెరువ చేసినట్లవుతుందని, మన ఊరు మన బడి అనేది కేసీఆర్ ఆలోచనకు గొప్పదన్నారు. అలాగే చిన్నప్పట్నుంచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్యస్వీ రాష్ట్ర కార్యదర్శి యన్యన్రాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, కోలేటి భవాని శంకర్, మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, రాంబాబు, రమణ, రాము, మండల యూత్ అధ్యక్షులు నాని తదితరులు పాల్గొన్నారు.