Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించాలి..
- సమస్యల పరిష్కారం బాధ్యత తహశీల్దార్లకు బదలాయించాలి
- తెలంగాణ రైతుసంఘం ధర్నా... అదనపు కలెక్టర్ కు వినతి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి, సాగు భూములను నిషేధిత జాబితా నుంచి తొలిగించాలి, సాగుదారులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో తలైతిన సమస్యలు సంవత్సరాల కాలంగా పరిష్కారం కాకపోవడంతో రైతులు మానసికంగా కృంగి పోతున్నారన్నారు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ స్థాయి నుంచి తహశీల్దార్లకు అధికారులు బదలాయింపు చేయాలి అని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులు, సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే రైతు బంధు నిలుపుదల చేశారు అని చెప్పారు. పరిహారం రైతులకు అందించే వరకు రైతు బంధు, రైతు భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరు భూమి మరొక రైతు పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. ఆ తప్పులను సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల దే అని అన్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల రైతులకు వంద సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టా దారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమం కొనసాగుతుందని రాంబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, ఉపాధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్, రాయల వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శులు ఎస్ కె మీరా, చింతనిప్పు చలపతిరావు, దుగ్గి కష్ణ, రచ్చా నర్సింహారావు, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కందుల భాస్కర్ రావు, బట్టు పురుషోత్తం, సంక్రాంతి నర్సయ్య, కుసూపుండి మధు, యనమద్ధి రామకష్ణ, బాణాల శ్రీనివాస్ రావు, ఎర్రబోయిన గోవింద్, గుర్రం కృష్ణయ్య, జట్లా రవి తదితరులు పాల్గొన్నారు.