Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుక్కలు, పిల్లి, పక్షులు మృతి
- మేకల కాపరికి తప్పిన ప్రమాదం
- భయాందోళనలకు గురవుతున్న గ్రామస్తులు
- రక్షణ చర్యలు చేపట్టాలి : సర్పంచ్ స్రవంతి
- త్వరలో రెస్క్యూ టీంతో బృందం : డీవైజీఎం
పర్సనల్
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని తిలక్ నగర్ పంచాయతీ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి భూగర్భగనిలో విషవాయువులు వెలువడు తున్నట్టు తెలిసింది. భూగర్భ గని సమీపంలో వాగు దగ్గర రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ రంధ్రాల గుండానే విషవా యువులు వెలువడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తిలక్ నగర్ గ్రామపంచాయతీలో సాయంత్రం కుమ్మరి బస్తి ఆంజ నేయస్వామి టెంపుల్ వెనకాల పల్లె ప్రకృతి వనం పక్కన ఉన్న ఒక కాలువలో గ్యాస్ లీక్ అవ్వడంతో 2 పెంపుడు కుక్కలు, ఒక అడవి పిల్లి, ఒక పక్షిమరణించాయి. అది గమనించిన మేకల కాపరి కుంజ భాస్కర్ అటువైపు వెళ్లగా అతను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు వెంటనే స్థానిక సర్పంచ్‌కు ఈ విషయం తెలియజేశాడు. దీంతో తిలక్ నగర్ గ్రామ పంచాయతీ ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ధనసరి స్రవంతి పాలక సభ్యులు, స్థానికులతో కలిసి ప్రదేశాన్ని దూరంగా పరిశీలించారు. చనిపోయిన మూగజీవాలను చూశారు.
రక్షణ చర్యలు చేపట్టాలి : సర్పంచ్ స్రవంతి
పురాతన భూగర్భ గనిలో వెలువడుతున్న విషవా యువు లను అరి కట్టాలని, రక్షణ చర్యలు చేపట్టాలని సంఘటనకు సంబంధించి జీఎం కార్యాలయంలో వినతి సమర్పించారు.
త్వరలో రెస్క్యూ టీంతో బృందం : డివైజీఎం పర్సనల్
తిలక్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి భూగర్భ గనిలో విషవాయువులు వెలువడుతున్న విషయమై డివైజియం పర్సనల్‌ను నవతెలంగాణ శుక్రవారం వివరణ కోరింది. స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విషయం తెలిసిందని సంఘటనా స్థలానికి వెళ్లి అధికారులు పరిశీలించారని తెలిపారు. త్వరలో రెస్క్యూ టీంతో బృందం విషవాయువు ఆ నవాలను పరిశీలిస్తారని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.