Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
మంచి ప్రణాళికతో చదివితే తప్పక విజయం మీ సొంతమవుతుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్పై పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఎస్పీ సునీల్ దత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలబస్‌ను ఆకలింపు చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం సన్నద్ధత కావాలని చెప్పారు. మన జిల్లా యువత పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంత మంది పరీక్ష రాస్తున్నారనేది ముఖ్యం కాదని, మనం ఎంత మంచిగా ప్రిపేర్ అయితో అంత బాగా పరీక్ష రాయగలమని విజయం సాధించగలమని చెప్పారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు నిర్ణీత సమయంలోగా పరీక్ష రాయడం చాలా ప్రధామని, ప్రతి రోజు స్వీయ పరీక్ష రాస్తుండాలని అప్పుడే సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోగలరని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, విద్యార్థులు ఫలితాలు గురించి ఆలోచించకుండా ఎఫర్ట్ పెట్టాలని చెప్పారు. చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగసాధనకు వస్తున్నారని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కోచింగ్ అందిస్తున్న మేధా స్టడీ సర్కిల్ శివప్రసాద్‌ను కలెక్టర్ అభినందించారు.
ప్రతి ఒక్కరూ తప్పక విజయం సాధించాలి : ఎస్పీ సునీల్‌దత్
ఉచిత కోచింగ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక విజయం సాధించాలని, మన జిల్లా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఐటీడీఏలో కూడా ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, విద్యార్థులకు మార్గదర్శిగా, ప్రేరణ కోసం పోలీసుశాఖలో ఉద్యోగాలు సాధించిన సిబ్బందితో మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తాం : అభ్యర్థులు
విద్యార్థులు మాట్లాడుతూ ఎంతో విలువైన ఈ ఉచిత కోచింగ్‌ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామని స్పష్టం చేశారు. కోచింగ్ వల్ల చాలా మెలకువలు నేర్పుతున్నారని, ఇవి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్ర మంలో ఏఎస్సీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ పున్నం చందర్, అధ్యాపకులు శివప్రసాద్, రిజర్వ్ ఇన్పెక్టర్లు సోములు, కామరాజు, దామోదర్, సత్యనారాయణ, పాల్వంచ ఏఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.