Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు టీఎస్ యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బళ్ళు తెరిచే నాటికి విద్యా వాలంటీర్లు, స్కాంవెంజర్లను నియమించడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని టియస్ యూటియఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు కలెక్టరేట్ లో శుక్రవారం వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకొని ఆంగ్ల మాధ్యమాన్ని 1 నుండి 8వ తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించిందని, కానీ నేటివరకూ ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత దుస్తులను అందించలేక పోయిందని, బడులు తెరిచేనాటికి అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటుగా పిల్లలకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు , దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. స్కావెంజర్లను నియమిం చుటకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జేయడం మూలంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగనుందని , దానికి తగ్గట్టుగా పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని తెలిపారు. ఖాళీలను భర్తీ చేసే వరకు విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి.వెంకన్న, జిల్లా కార్యదర్శి పి.సురేష్, యు.నాగేశ్వరరావు తదితరులున్నారు.