Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్లకు గుదిబండగా పల్లెప్రగతి
నవతెలంగాణ-కారేపల్లి
పల్లె ప్రగతి అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తుందని, నిధులు లేకుండా పల్లెలు ప్రగతి ఎలా సాధిస్తాయో తెల్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం గాదెపాడులో పర్యటించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు మేమంటే మేము ఇస్తున్నామని ప్రకటించుకుంటున్నాయని సర్పంచ్ పరిస్ధితి మాత్రం కక్కలేక మింగలేక అనే సామేతలా ఉందన్నారు. పల్లె ప్రగతి సర్పంచ్లకు గుదిబండా మారిందని సర్పంచ్లు అవేదన చెందుతున్నారన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకా, చేయటానికి పెట్టుబడి లేక అవస్ధలు పడుతూ కొందరు పరువుకు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్న ఘటనలు వెలికి వస్తున్నాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్వి ఉత్తుతి హామీలే అని వాటి అమలు పోరాటాలే శరణ్యమన్నారు. పోడు హక్కు కోసం గిరిజనులు జైలు పాలైన పట్టు వీడటం లేదని, పోడుతో వారి జీవనం ముడిపడి ఉందనే విషయం ప్రభుత్వం గ్రహించాలన్నారు. గిరిజన వాడల్లో ఉండే హక్కు కల్పిస్తానన్నా హామీ గాలికి పోయిందని అటవీ అధికారులు మాత్రమే పోడుదారులను అవస్ధలు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకుంటామన్నారు. అంతకుముందు సీపీఎం నాయకులు జంపాల వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న గాదెపాడు మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు భూక్యా జగ్యాను వారు పరామర్శించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కేలోత్ స్వప్నసూర్యకుమార్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, భూక్యా లక్ష్మన్, కేలోత్ సూర్యకుమార్, భూక్యా సురేష్, రామకృష్ణ, భారతి, గోపి పాల్గొన్నారు.