Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారేపల్లిలో బడిబాటలో పాల్గొన్న ఎమ్మెల్యే
నవతెలంగాణ-కారేపల్లి
అక్షరాస్యతలో వెనకబడిన తెలంగాణను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కొనియాడారు. శుక్రవారం కారేపల్లిలో జరిగిన బడిబాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కారేపల్లి హైస్కూల్లో ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే కారేపల్లిలో ప్రదర్శనగా ఇంటింటికి తిరిగి రెండున్నర ఏండ్ల పై బడిన పిల్లలకు అక్షరాభ్యస్యం చేయిస్తూ అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. గొర్రెలమంద కనిపించటంతో అక్కడి వెళ్ళి కాపరులతో వారి సమ స్యలు తెలుసుకున్నారు. ర్యాలీ అనంతరం బస్టాండ్ సెంటర్లో మాట్లాడుతూ విద్యద్వారానే సమాజా భివృద్ధి సాధ్యమనే భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా గురుకులాలను ఏర్పాటు చేశార న్నారు. తెలంగాణలో మౌళిక వసతుల కల్పన తో భారీగా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దీంతో యువకులు ఉన్నత ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. కరువు తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌దన్నారు. ముందు చూపు, ప్రణాళిక, ఆర్ధిక క్రమశిక్షణ తో రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకెళ్ళుతూ దేశానికి మార్గదర్శిగా మారరన్నారు.
చెరువు భూములను సంరక్షించాలని వినతి
కారేపల్లి పెద్దచెరువు అక్రమణలతో కుచించుక పోతుందని దానిని సంరక్షణకు చర్యలు చేపట్టాలని కారేపల్లి మత్స్య సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యే రాములునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. 184 ఎకరాల చెరువులో ఇప్పటికే 60 ఎకరాలలు కబ్జాకు గురైందని వినతిలో పేర్కొన్నారు. ఇదే చెరువు శిఖంలో అధికారులు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారని దీనిని విరమింపచేయాలని కోరారు. చెరువు కు హద్దులు నిర్ణయించి రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. అనంతరం మంగళితండా పంచాయతీ కార్యదర్శి భూక్యా తిలక్కిషోర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేట్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో జయరాజు, ఎంపీవో రాజారావు, హెచ్ఎం పవన్‌కుమార్, ఆత్మ కమిటి చైర్మన్ ముత్యాల సత్య నారాయణ, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, టీఆర్ఎస్ అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతు బంధు మండలకన్వీనర్ గుగులోత్ శ్రీను సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ సంఘం అధ్యక్షగౌరవ అధ్యక్షులు దారావత్ పాండ్యానాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, దిశకమిటీ సభ్యులు బానోత్ కుమార్, సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య పాల్గొన్నారు.