Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని నన్నపనేని మోహన్ పాఠశాల, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, సెయింట్ పాల్స్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తదితర ఆరు పరీక్ష కేంద్రాల్లో ఈ టెట్ పరీక్ష జరిపారు. ఈ పరీక్షకు మొత్తం 1,440 అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, ఉదయం జరిగిన పరీక్షల్లో 99 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలో 105 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. విద్యా శాఖ, రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
మణుగూరు ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణలో భాగంగా మణుగూరులో నూతన పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ కో-ఎడ్యుకేషన్ పాఠశాల, ఎక్స్లెంట్ స్టార్ హై స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం అభ్యర్థులు ఎనిమిది వందల అరవై మంది హాజరైనారు. తహసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుండి అర్హత పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. ముత్యం రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ పురుషోత్తం బందోబస్తు నిర్వహించారు.