Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
గోదావరిఖనిలో సీఐటీయూ నాయకులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు, టీబిజికెఎస్ నాయకుల దాడిని ఖండించండని సీఐటీయూ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అన్నారు. గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచి ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌పై టిఆర్ఎస్, టిబిజికెఎస్ నాయకులు అధికార పార్టీని అడ్డంగా పెట్టుకుని వీధి రౌడీల్లా ప్రవర్తిస్తు తప్పతాగి మైకంలో సిఐటియు నాయకులపై దాడి చేయడాన్ని విజయగిరి తీవ్రంగా ఖండించారు. స్థానిక సమస్యలపై సిఐటియు నాయకులు ఆందోళన-పోరాటాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారని ఓర్వలేక నీచమైన చర్యలకు టిఆర్ఎస్, టిబిజికేఎస్ నాయకులు పాల్పడుతున్నారని అన్నారు.బ్రాంచ్ కార్యదర్శి మెండె శ్రీనివాస్, కుమార్ అనే విలేకరిపై దాడి చేస్తూ విపరీతంగా కొట్టడం జరిగిందని అన్నారు.అంతటితో ఆగకుండా వేణుగోపాల్ ఇంట్లోకి వెళ్లి మహిళపై కూడా దాడిచేసి కొట్టడం దుర్మార్గపు చర్యలని, ఇలాంటి చర్యలను ఇంతటి దౌర్జన్యాలకు పాల్గొనటం చూస్తుంటే వీరి యొక్క రౌడీయిజం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుందని, రాబోయే కాలంలో కార్మికులు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
మణుగూరు సీఐటీయూ నాయకులపై టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకట రత్నం అన్నారు. ఆదివారం బ్రాంచ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన సీఐటీయూ అర్జీ 1 ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి మెండే శ్రీనివాస్, సివిఆర్ రిపోర్టర్ అరెళ్లి కుమార్ పైన అకారణంగా దాడి చేసి గాయపర్చడం జరిగిందన్నారు. సీఐటీయూ ఎదుగుదలను చూడలేకే దాడులకు పాల్పడ్డారు అన్నారు. దాడి చేసిన టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు అడ్డా గట్టయ్య, ధరణి జెలపతి, మిలాది శ్రీనివాసరావు, జువ్వాల వెంకన్న వీరందరి పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లక్ష్మణరావు, రామ్మూర్తి, విల్సన్ రాజు, శివకుమార్, ఆర్.ఈశ్వరరావు, బుచ్చిరెడ్డి, పారుపల్లి లక్ష్మణరావు, ముజఫర్, ప్రభాకర్ రావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.