Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మికంగా తనికీ చేసిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం/పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిని రెండు పేపర్లకు అభ్యర్థు హాజరయ్యారు. ఆదివారం జరిగిన పరీక్షకు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకున్నారు. 9.30 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష నిర్వహించారు. టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీచేశారు. పాల్వంచ. మండలంలోని ఎస్సీ సంక్షేమ పాఠశాల, రేజీ నా పాఠశాల, డిఏవి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థుల వివరాలను నిర్దేశిత ప్రొఫార్మలో అందచేయాలని చీఫ్ సూపరింటెండెంట్స్ను ఆదేశించారు. చీఫ్ సూప రింటెండెంట్ హాలులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించారు. టెట్ పరీక్ష నిర్వహణకు పేపర్లు వారిగా కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 40 కేంద్రాలు, మధ్యాహ్నం నిర్వహించు పరీక్షకు 32 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం పరీక్షకు 9509 మందికి గాను 8915 మంది పరీక్ష రాశారు. 594 మంది గౌర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన 2వ పేపర్ పరీక్షకు 7238 మందికి గాను, 6786 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
452 మంది గౌర్హజరయ్యారు. ఈ పరీక్షలు నిర్వ హణకు 8 మంది గెజిటెడ్ అధికారులను, 8 మంది అధికారులతో ఫ్లైయింగ్ స్క్వాడ్, 40 మంది చీఫ్ సూపరిం టెండెంట్స్, 40 మంది డిపార్ట్మెంటల్ అధికారులు,120 మంది హాల్ సూపరింటెండెంట్స్, 440 మంది ఇన్విజి లేటర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ ను పరిశీలించారు. ఈ ఆకస్మిక తనిఖీలో డీఈఓ సోమశేఖరశర్మ, తహసీల్దార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.