Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవా దృక్పథంతో రోటరీక్లబ్ ఏర్పాటు
- రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్
నవతెలంగాణ-బూర్గంపాడు
యువత సమాజసేవ చేసేందుకు ముందుకు రావాలని ఐటీసీ పీఎస్పీడీ మాజీ గ్రూపు చైర్మన్, రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా చార్టర్ ప్రెసిడెంట్ సంజరు సింగ్ అన్నారు. చుట్టూ ఉన్న వారి అవసరాలు తెలుసుకుని వారికి సేవలందించేందుకు రోటరీక్లబ్ మంచి వేదిక అని పేర్కొన్నారు. రోటరీక్లబ్ ఆధ్వర్యంలో సంజయసింగ్, ఆషాసింగ్ దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం స్థానిక పుష్కరవనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంజరు సింగ్ మాట్లాడుతూ ఉన్నతమైన లక్ష్యంతో రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రాను స్థాపించామని ఆయన వివరించారు. కార్పొరేట్ స్థాయిలో ఆసియాలోనే అతిపెద్ద క్లబ్‌గా నిలవడంలో రోటరీక్లబ్ సభ్యుల కృషి ఎంతో ఉందన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో విశేష సేవలందిస్తున్నామని ఆయన తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. వృత్తిపరమైన విధులతో పాటు సమాజసేవకు సమయం కేటాయించాలని యువతకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధానికి క్లబ్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ప్రోత్సహిం చడం ద్వారా ప్లాస్టిక్‌ను నిర్మూలించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ఉచితంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు హరినారాయణన్, యూనిట్ హెడ్ సిద్ధార్ధ మొహంతి, బసబ్ ఘోష్, రోటరీక్లబ్ కార్యదర్శి షేక్ భాషా, ఐటీసీ ఉన్నతాధికారులు టీఎస్ భాస్కర్, శ్యామ్ కిరణ్, చెంగల్రావు, మారదాన శ్రీనివాస్, సాయిరాం, బూశిరెడ్డి శంకర్ రెడ్డి, రాంబాబు, విజరు కుమార్, కిషోర్, నిరంజన్, రవిబాబు, జేకే దాస్, వి మురళి, అమిత్ సింగ్, తమక్, ఖాదర్, వెన్సెలాస్, సంతియా, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.