Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ విద్య అభివృద్ధికి ఎనలేని చేయూతనిస్తున్న ప్రముఖ న్యాయవాది
- జలసూత్రం శివరాంప్రసాద్
- తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ
- లక్షల ఖర్చుతో గ్రామానికి అభివృద్ధి
నవతెలంగాణ-పాల్వంచ
పుట్టిపెరిగిన గడ్డపై ఆ గ్రామ ప్రజలకు అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఆయనది. సంపాదించినదాంట్లో ఎంతోకొంత సేవ చేయాలనే తపన తాతల తండ్రుల నుండి గ్రామ అభివృద్ధిలో వీరి భాగస్వామ్య సంస్కృతిని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తూ గ్రామం అభివృద్ధి బాటలో నడవాలంటే ఆ గ్రామంలో అక్షరాస్యత పెరిగి విద్యార్ధులకు మంచి భవిష్యత్తును అందించాలని భావించారు. కల్లారా గ్రామ పరిస్థితిని చూసి ఆ ఊరిలో ఉన్న పాఠశాలకు మౌలిక వసతులు లేక విద్యార్ధులు పడే ఇబ్బందులను చూసి ఉద్యోగరీత్యా ఆ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో స్థిరపడ్డ ఆ గ్రామానికి సొంత డబ్బులు లక్షలు వెచ్చించి గ్రామాభివృద్ధి పాఠశాలకు మౌలిక సదుపాయాల కోసం చేయూతనిస్తూ ఉదారత చాటుకున్నారు. ప్రముఖ సీనియర్ న్యాయవాధి.
పాల్వంచ మండల పరిధిలోని తంతెలబోర పాతూరు గ్రామస్తులు జలసూత్రం వెంకటేశ్వర్లు సూర్యసుందరి దంపతుల కుమారుడు శివరాంప్రసాద్. వృత్తిరీత్యా న్యాయవాధి. కొత్తగూడెం కోర్టులో విధులు నిర్వహిస్తు న్నారు. పాల్వంచ బ్రాహ్మణ కాలనీలో నివాసముంటూ తాతల తండ్రుల నుండి గ్రామాభివృద్ధిలో వీరి భాగస్వామ్యం ఉండేది. అదే సంస్కృతిని కొనసాగిస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూన్నారు.
సొంత ఊరి విద్యాభివృద్ధికి పాటుపడుతూ
సొంత గ్రామంలో అక్షరాస్యత పెరిగితే ఆ గ్రామంలో విద్యార్థుల మంచి భవిష్యత్తుతో పాటు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన శివరాంప్రసాద్ ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలలో ప్రధాన భవనాలతోపాటు కార్యాలయం, కిచెన్, వాష్‌రూంల గోడల పెచ్చులు ఊడిపోయి, ఫ్లోరింగ్ లేచిపోయి సంవత్సరాల క్రితం వేసిన రంగులు వెలిసిపోయి స్కూలు ప్రహారీ గోడ కూలిపోయి మొత్తం పాఠశాల దయనీయ పరిస్థితికి చేరింది. నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడడాన్ని చూసి రైతు బందు కింద వచ్చిన రూ.50 వేలతో బోరు మోటార్ ఏర్పాటు చేశారు. దీంతో మంచినీటి సమస్య పరిష్కారం అయింది. తరగతి గదుల కొరతతో కొందరు విద్యార్థులు చెట్లకింద చదువుకుంటుం డడంతో సిమెంటు రేకులతో రెండు గదులు నిర్మించారు. రక్షిత మంచినీటి సౌకర్యం నిమితం 6వ ప్లాంట్ ఏర్పాటు చేసి ఓ మినీ ట్యాంకుకు సమకూర్చారు. విద్యార్థులకు తాగునీటి అవసరాలు తీర్చారు. ఆయనతోపాటు మందపాటి రామ చంద్రరాజు జ్ఞాపకార్ధం ఆయన మనవడు హర్ష, కొండబోయిన వెంకటేశ్వర్లు రత్నాయమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి మనవడు పవన్‌లను భాగస్వాములను చేస్తూ సుమారు రూ.2 లక్షలను ఖర్చుచేసి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. రంగులు వేయించి చెట్లను నాటి విద్యార్థులను పరిశుభ్రమయిన మంచినీరు అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివే విధంగా ఆ పాఠశాలను అభివృద్ధి చేశారు.
యువతను సన్మార్గంలో నడిపించేందుకు
యువత సన్మార్గంలో నడిపించేందుకు ఎస్సీ కాలనీలో రూ.లక్షలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయించారు. సీపీఐ(ఎం) కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులతో విగ్రహావిష్కరణ చేశారు. స్థానికంగా ఉన్న యువత మంచి బాటలో నడవాలని తరచూ సభలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగ హక్కులను వివరిస్తూ రిజర్వే షన్ ఫలాలను తెలియజేస్తూ చైతన్యపరిచారు. అంతేకా కుండా గ్రామంలో ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం దంతెల బోర గొల్లగూడెంలో రూ.లక్ష విరాళం అందించారు.
సొంత ఊరికి సేవ చేయాలనే తపన
సొంతవూరికి ఎంతోకొంత సేవ చేయాలని దృక్ప దంతో ముందుకు వెళుతున్నాను. మా తాత దండ్రుల నుండి గ్రామంలో అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ సేవా దృక్పదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మాతరం అన్నద మ్ముల సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాలకు అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే ఉంటాం.
- శివరాంప్రసాద్