Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలానికి చేరని పాఠ్యపుస్తకాలు
- అడ్రస్ లేని యూనిపామ్ ?
నవతెలంగాణ- కల్లూరు
ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నప్పటికి నేటి వరకు పాఠ్యపుస్తకాలు కానీ యూనిఫామ్స్ కాని మండలాలకు చేరకపోవటంతో ప్రారంభంలోనే సౌకర్యాలు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే సమయానికే ప్రతియేటా పాఠ్యపుస్తకాలు మండలాలకు చేరేవి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ విద్యార్థులలో ప్రోత్సాహం నింపడానికి అవకాశం ఉండేది. ఈ ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.డ ఈ నెల ఒకటో తేదీ నుండి బడిబాట కార్యక్రమం చేపట్టి ఉపాద్యాయులు ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్‌తో పాటు మధ్యాహ్న భోజనం సౌకర్యాలుంటాయని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేసారు. దీంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించ టానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. మండలానికి సుమారు 26 వేలు పాఠ్య పుస్తకాలు అవసరం ఉంటుందని మండలం నుండి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం సమయానికి పాఠ్యపుస్తకాలు అందించటం లేదు. గత సంవత్సరం చదివిన తరగతిని జూన్ 30 వరకు బోధించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈలోగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తారని అంటున్నారు. గత ఏడాది కూడా విద్యార్థులకు యూనిఫాండ ఇవ్వలేదు కనీసం ఈ విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం సరఫరా చేస్తారా లేదా అని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే తమ పిల్లలకు అన్ని సౌకర్యాలు వనకూరుతాయని విద్యార్థులు తండ్రులు ఆశించారు కానీ ప్రారంభ సమయానికి ఉపాధ్యా యలు ప్రచారం చేసిన హమీలు ఏవీ నెరవేరకపోవటంతో ఉపాధ్యాయలు తల్లిదండ్రులకు ఏవిధంగా సమాధా నం చెప్పాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు సరఫరా చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.