Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువుల, పురుగు మందుల ధరలను తగ్గించాలి
- విత్తనాలను సబ్సిడీ ద్వారా ఇవ్వాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
లక్షలోపు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి, వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను వడ్డీల పేరుతో వేధిస్తున్న బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. రైతుబంధు, ఉపాధి హామీ పని ఎర్రటి ఎండలో పని చేసిన డబ్బులను ఎకౌంట్లో నుండి రాకుండా హౌల్డ్లో పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురుగు మందుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలను సబ్సిడీ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండించిన పంటకు స్వామినాథన్ సిఫార్సు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న పోడు రైతులకు రైతు బందు అమలు చేయాలని అని అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అమలు చేస్తానన్న సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు. గత పాలకుల నుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబానికే మేలు జరుగుతుందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండగా రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, మాలోతు రావూజ, నిమ్మల మధు, వూకంటి రవికుమార్, గొగ్గల ఆదినారాయణ, సోయం వీరస్వామి, కుంజా రామ్మూర్తి, వర్సా శ్రీరాములు, పద్దం తిరుపతమ్మ, కీసరి వెంకట్రావ్, మంచాల సారయ్య పాల్గొన్నారు.