Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం గాంధీనగర్ భూపతిరాయుని చెరువు అలుగు తూములను వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు. భూపతిరాయుని చెరువు అలుగు తూములు రెడిటి గేట్లు తుప్పుపట్టి రంధ్రాలు పడటంతో చెరువులో నీళ్లు వృధాగా పోతున్నాయని రైతులు వాపోతున్నారు. మిషన్ కాకతీయలో తూము పనులు నామమాత్రం చేసి వదిలి వేయటంతో మరోసారి మరమ్మత్తులకు వచ్చాయన్నారు. వర్షాకాల సీజన్ రావటంతో నీటిపారుదల శాఖ అధికారులు స్పంధించి భూపతిరాయుని చెరువు అలుగుపై ఉన్న తూములను యుధ్దప్రాతి ప్రధికన మరమ్మత్తులు చేయించాలని కోరారు.