Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘరానా సెంటిమెంట్ మోసం
- అక్కయ్య గారు.. అన్నయ్యగారూ.. అంటూ మాటల కలబోత...
- పోలీస్ అధికారి సైతం బాధితులే...
- ఆందోళనలో బాధితులు...
నవతెలంగాణ- ఖమ్మం
గ్రామీణ ప్రాంత సాంప్రదాయ సభాషణల మేళవింపులో భాగంగా అన్నయ్య వదినమ్మల పేర్లతో వరసలు కలుపుతూ ఈ సూట్ కేసులో విలువైన పత్రాలు ఉన్నాయని మోసం చేస్తూ నమ్మిస్తుంది...ఇక డబ్బులు లాగడం ఎలాగో.. మోసం చేయటం ఎలాగో..ముందేస్క్రీన్ ప్లే రాసుకుంటది మాయలా (లే)డి...ఓ మహిళ చేసిన నిర్వాకం ఐదు కోట్ల రూపాయల ఘరానా మోసం ఘటన ఖమ్మం నగరంలో జరిగింది.
వదినగారు మేము అర్జెంట్‌గా చుట్టాల ఇంటికి వెళ్లుతున్నాం. అసలే దొంగల భయం ఉంది. అందుకే ఈ సూట్‌కేస్‌ను మీ ఇంట్లో పెట్టుకొండి అంటూ ఆ మహిళ మొదట మాటలు కలుపుతుంది. ఈ తర్వాత ఈసూట్ కేస్ మీ మీద నమ్మకంతో అప్పగిస్తున్నా ఎందుకంటే ఇందులో ఎంతో విలువగల పత్రాలు, వస్తువులు ఉన్నాయి. వాటిలో 10లక్షల రూపాయల విలువగల బంగారం, మూడుకోట్ల రూపాయల విలువగల మా ఇంటి పత్రాలు, మాఅమ్మపేరు మీదగల ఫిక్స్డ్ డిపాజిట్లు, 60 ఎకరాలపత్రాలు, మా అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్లు, 60 ఎకరాల భూమి తాలుకా కాగితాలు ఉన్నాయి అంటూ అవతలవారు నమ్మేలానమ్మిస్తుంది. మూడు రోజుల తర్వాత వచ్చి తన సూట్‌కేస్ తీసుకొంటుంది. చాలా థ్యాంక్స్ అంటూ థాంక్స్ చెబుతుంది. కరెక్ట్‌గా మరో రెండు రోజుల తర్వాత సూట్‌కేస్ ఎవరి ఇంట్లో పెట్టిందో వారి ఇంటికి ఫోన్ చేసి వదిన గారు అర్జెంట్‌గా ఐదులక్షల రూపాయల డబ్బు కావాలి వెంటనే ఇచ్చేస్తాను మాకువచ్చే డబ్బులు రాలేదు. వడ్డీ ఎంతయినా ఫర్వాలేదు అంటూ తనమాటలతో నమ్మిస్తుంది. అప్పటికే ఆమెహౌదా చూసిన వాళ్లు ఆమెకు ఐదు లక్షల రూపాయలు అప్పుగా ఇస్తారు. అంతే ఆమె ఇస్తానన్న గడువు వచ్చాక ఫోన్ చేస్తే వాయిదాలు వేస్తది. తనకు ఇంత పెద్ద ఇల్లుఉంటే ఎక్కడికైనా పారిపోతానా అంటూ దబాయిస్తది. అయితే ఇదే తరహాలో మరికొంతమంది వద్ద అక్కగారు. అన్నయ్యగారు, అంటూ మరల సూట్‌కేస్‌ను పెట్టడం. అందులో విలువైన వాటి గురించి వారిని నమ్మించటం అందినకాడికి అప్పుగా లక్షలు లాగుద్ది..దీనికితోడు తాను 5 నుంచి ,10లక్షల రూపాయలు చిట్టిలు వేస్తున్నానని టూటౌన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ లక్షల రూపాయలు వసూలుచేసింది... అయితే కొన్ని నెలలుగా డబ్బుకోసం బాధితుల ఒత్తిడి ఎక్కువ అయింది. మోసపోయిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా వుండటం గమనార్హం....దీంతో ఆమె తన ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచాఫ్ చేసి చెప్పకుండా ఉడాయించింది... మొత్తం 5 కోట్ల రూపాయల మేరకు ఆమె బాధితులకు కుచ్చుటోపి పెట్టినట్లు సమాచారం... ఇది ఇలా ఉండగా బాధితులంతా ఆమెభర్తను కలిసి తమ డబ్బుల గురించి అడుగగా తనకు సంబంధం లేదని ఆమెనే అడగండి అంటూ చెప్పటంతో ఒక్కసారిగా అయోమంలో పడిపోయారు. దీనికితోడు తాను 5, 10లక్షలరూపాయలు చిట్టిలు వేస్తున్నానని టూటౌ ప్రాంతంలో బ్యాంకు కాలనీలో నివసిస్తున్న మహిళ లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే కొన్ని నెలలుగా డబ్బుకోసం బాధితుల గోల ఎక్కువ కావడంతో ఆమె తన ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచాఫ్ చేసి చెప్పకుండా ఉడాయించింది.
భర్తతో బాధితులు వాగ్వావాదానికి సైతం దిగారు. ఆ మహిళ భర్త నాకు సంబంధం లేదని చెప్పటంతో వారు లబోదిబోమంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసారు. అయితే పోలీసులు ఇది సివిల్ వివాదం కోర్టులో తెల్చుకోమ్మని చెప్పటంతో బాధితులంతాక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీనికితోడు కుచ్చుటోపి పెట్టిన మహిళ ఆమెకుటుంబసభ్యుల తరుపు వారు బాదితుల డబ్బుఏగోట్టేందుకు పలువురు రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కానిస్టేబుల్ దంపతులు కొంతమంది ఉద్యోగులను మోసం చేసిన తీరు మరవకముందే మరో సంఘటన జరగటంతో దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఈమాయలేడిపై చర్యలు తీసుకోవాలని బాధితులుకోరుతున్నారు.