Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 3 ఇంక్లైన్ మైన్స్ రెస్క్యూస్టేషన్ గ్రౌండ్ నందు అండర్-14, బాల, బాలికల రెజ్లింగ్ జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 30 మంది బాల, బాలికలు హాజరయ్యారు. వయసు, బరువు, ప్రతిపాదికన వివిధ కేటగిరిలో నిర్వహించగా, పోటీలో తలపడి అత్యంత ప్రతిభ కనబర్చిన బాల, బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా అమె చూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్ తెలిపారు. జిల్లా జట్టు క్రీడాకారులు త్వరలో జరగనున్న పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు గెలుపొందే విధంగా వీరికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వీరికి జాతీయ సీనియర్ క్రీడాకారుడు. ఏ.వెంకట ప్రసాద్ కోచ్గా వ్యవహరించనున్నారని కాశీ హుస్సేన్ పేర్కొన్నారు.
జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు
బాలుర విభాగములో కె.లికిత్ చరణ్, ఆర్.శ్రీసాయి, ఆశిష్ కొత్తగూడెం, జి.సాయికిరణ్ జి.సాయి కార్తీక్, సుజాతనగర్, ఇ.చిన్మయ చారి చండ్రుగొండ, ఏ.జస్వంత్, బి.రామ్ చరణ్ పాల్వంచ, ఏ.రోశిత్ టేకులపల్లి ఎంపికయ్యారు. బాలికల విభాగంలో ఏ.ఆశ్రిత. పాల్వంచ, ఎం.గ్లోరీ ప్రశస్త, వి.సాయి శృతి, వై.పద్మ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ సీనియర్ క్రీడాకారుడు వెంకటప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.పి. కాశీ హుస్సేన్, జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ.మొగిలి, పలువురు క్రీడాకారులు జస్వంత్, విశాల్, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.