Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి అప్పారావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్మగూడెం గ్రామంలో గల ఎస్ఎల్ఎస్ మినీ హైడల్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.వి.అప్పారావు డిమాండ్ చేశారు. 2021 నుండి ఎప్రియల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు రావాల్సిన ఆరు నెలల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఎస్ఎల్ఎస్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పవర్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జనార్ధన రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఆరు నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.3750, సెమి స్కిల్ డ్ కార్మికులకు రూ.4371 డీఏ చెల్లించాల్సి ఉందన్నారు. కానీ యాజమాన్యం ఇందుకు విరుద్ధంగా ఆరు నెలల కాలానికి రూ.1620 మాత్రమే డీఏ చెల్లించారన్నారు. మిగిలిన మొత్తం డీఏను జూన్ నెల వేతనంతో కలిపి జూలై నెలలో చెల్లించాలన్నారు. దీంతో పాటు 2022 ఏప్రిల్ నుండి వచ్చిన కొత్త డీఎ కూడా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొలగని రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి, పవర్ ప్రాజెక్ట్ యూని యన్ నాయకులు ప్రకాష్ నరేంద్ర, రాంబాబు, రమేష్, సతీష్, చిరంజీవి, అనంతరావు, అరవిద్, తదితరులు పాల్గొన్నారు.